సీజన్ ను బట్టి దొరికే పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండు.. రుచిలో కాస్త ఒగరు, తీపి కలగలిపి ఉంటుంది. ఈ పండును వేసవిలో ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ ఈ పండు తినడం వల్ల కలిగే లాభాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండు వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నాయి. వేసవిలో మన శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఖర్బూజలో దాదాపు 90 శాతం నీరే ఉంటుంది కాబట్టి వేసవిలో ఈ పండు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ఖర్బూజలో బీటాకెరోటిన్, విటమిన్ సి వంటివి కూడా ఉంటాయి.
ఇవి మనశరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి తెల్ల రక్త కణాల వృద్దిని పెంచుతాయి. ఇక ఖర్బూజలో అమినో యాసిడ్ కు చెందిన ” సిట్రులిన్ ” ఉంటుంది. ఇది శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక ఈ పండులో విటమిన్ ఏ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. కిడ్నీరాళ్ళు ఉన్న వ్యాధిగ్రస్తులు కచ్చితంగా ఖర్బూజ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాకుండా మల విసర్జన కూడా సాఫీగా జరుగుతుంది. ఖర్బూజలో ఉండే విటమిన్ కె, విటమిన్ ఇ వంటివి స్త్రీ పురుషులలో ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా మూత్రాశయంలోని మాలినలు కూడా శుభ్రం అవుతాయి. ఇక ఖర్బూజలో చక్కెర శాతం కాస్త తక్కువగానే ఉంటుంది కాబట్టి.. మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం ఎంతో మంచిదట. అందువల్ల వేసవిలో మాత్రమే దొరికే ఈయొక్క ఖర్బూజ పండ్లను కచ్చితంగా ప్రతిఒక్కరు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి…