బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మిస్టరీ ఇంకా వీడట్లేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మర్డర్ కేసులో కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు గురించి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ… ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లూవీళ్లు చెప్పిన మాటల ఆధారంగా కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయన్నారు. దానిపై మేం చర్యలు చేపట్టాం. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాం. అయితే ప్రాథమిక సాక్ష్యాలను సేకరిస్తున్నాం. ప్రస్తుతం వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దశలో ఉన్న కేసు వివరాల గురించి ఏం చెప్పలేన్నారు.
Also Read: స్ట్రాటజీ మీటింగ్.. టి కాంగ్రెస్ లో కల్లోలం?
2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబాయిలోని తన అపార్ట్మెంట్‌లో విగతజీవిగా కన్పించారు. ఆయన మృతి బాలీవుడ్‌తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్‌కు గురిచేసింది. అయితే ఈ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కేసును సీబీఐకి అప్పజెప్పారు. సుశాంత్ మరణానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశాల సాలియన్ అనుమానాస్పదంగా మృతిచెందారు.
Also Read: ఘనంగా బక్రీద్ వేడుకలు…