నిఖిల్ ‘స్పై’ రిజల్ట్ ఇదే

43
- Advertisement -

యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీన‌న్‌ జంటగా నటించిన ‘స్పై’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం రండి. నేతాజీ అదృశ్య నేపథ్యం, దీనిపై దర్యాప్తు చేసే రా ఏజెంట్‌గా నిఖిల్‌ని చూపించారు. అయితే, స్క్రీన్ ప్లే సరిగా లేదు. కొన్ని సీన్లు, పాత్రలు అసందర్భంగా వస్తాయి. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ పెద్దగా లేదు. సినిమాలో విఎఫ్ఎక్స్ వ‌ర్క్ కూడా అంత గొప్ప‌గా లేదు. కాకపోతే సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని.. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు.

కానీ, నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడటం కష్టమే అంటున్నారు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. నిజానికి కార్తీకేయ 2 హిట్ తర్వాత నిఖిల్ కి మార్కెట్ బాగా పెరిగింది. పైగా కార్తీకేయ 2 నార్త్ లో కూడా చాలా బాగా ఆడింది. అందుకే ఈ స్పై థ్రిల్లర్ పై నార్త్ లో కూడా బజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఆ బజ్ కు తగ్గట్టు సినిమా లేదు. మరోపక్క ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

Also Read: పవన్ ‘బ్రో’కి ఇబ్బందులు తప్పవా?

స్పై సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మాత‌లకు భారీ మొత్తం చెల్లించిన‌ట్లు తెలుస్తోంది. మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ నేపథ్య సంగీతం బాగుండటంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అందుకే అమెజాన్ భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్ కొనుకుంది. కానీ థియేటర్స్ పరంగా మాత్రం స్పై నిరాశ పరిచింది.

Also Read: Oscar:ప్రౌడ్‌ మూమెంట్‌.. జ్యూరీలో ఆర్ఆర్ఆర్ టీం..

- Advertisement -