బర్త్ డే…మొక్కలు నాటిన వాసుదేవరెడ్డి

226
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మలక్ పెట్ వికలాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటానని వెల్లడించారు.

సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నాకెంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా వినూత్నమైన మార్పు తీసుకొచ్చిందని అన్నారు.

- Advertisement -