ఏపీ సీఎం జగన్‌తో టీడీపీ ఎంపీ భేటీ

33
- Advertisement -

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండగా రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఇవాళ ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలోనే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. కేశినేని బ్రదర్స్ మధ్య వార్‌లో చంద్రబాబు…నాని తమ్ముడు చిన్ని వైపు ఉండటంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటు వస్తున్నారు నాని.

ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబే స్వయంగా చెప్పడంతో రగిలిపోయిన నాని..పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఆయన కూతురు టీడీపీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున నాని పోటీ చేసే అవకాశం ఉంది.

2014,2019 ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు నాని. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి ఎంపీగా నాని పోటీ చేయనున్నట్లు సమాచారం.

Also Read:మరో హీరోయిన్ పెళ్లికి రెడీ?

- Advertisement -