ఆర్టీసీ సమ్మె….మధ్యవర్తిగా ఉంటా: కేకే

501
keshavarao
- Advertisement -

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వానికి,కార్మికులకు మధ్యవర్తిగా ఉంటానని తెలిపారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు. ఆర్టీసీ సమ్మెపై మరోసారి స్పందించిన ఆయన సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోయారన్న బాధతో నిన్న ప్రకటన చేశానని చెప్పారు. ఇప్పటివరకు సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ నన్ను పిలవలేదు…ఆర్టీసీ కార్మికులు తనను కలవలేదన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని నిన్నటి లేఖలో కార్మికులకు సూచించారు కేకే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. దీనిలో భాగంగానే కార్మికులకు 44% ఫిట్‌మెంట్, 16% ఐఆర్ ఇచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కేకే తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -