ఆర్టీసీ సమ్మె..మెట్రో మరో రికార్డు

495
Metro
- Advertisement -

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు మరో రికార్డును సొంతం చేసుకుంది. సమ్మె సందర్భంగా సిటిలో బస్సులు తక్కువగా నడుస్తుండటంతో చాలా మంది మెట్రో లో ప్రయాణిస్తున్నారు. దసరా సెలవులు ముగియడంతో పల్లెటూరిలోకి వెళ్లిన వారంతా తిరిగి హైదరబాద్ కు వస్తున్నారు. ఈసందర్భంగా హైదరాబాద్ మెట్రోలో నిన్న ఒక్క రోజే 3లక్షల80వేల మంది ప్రయాణించినట్లు తెలిపారు మెట్రో అధికారులు.

కొద్ది రోజుల క్రితం 3లక్షల75 మంది ప్రయాణించగా తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో‌ని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇక నాగోల్ టు హైటెక్ సిటీ రూట్‌లో నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టుగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె ఉండటంతో ప్రతి నాలుగు నిముషాలకు ఒక రైలును నడుపుతున్నట్లు తెలిపారు అధికారులు.

- Advertisement -