కేరళ స్టోరీపై తమిళనాడులో తీవ్ర వివాదం నెలకొంది. ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే) మే 7న చెన్నైలో నిరసనకు దిగింది. నామ్ తమిళర్ పార్టీ నిర్వాహకుడు, నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు.
ది కేరళ స్టోరీని ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ థియేటర్‌లో నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ శ్రేణులు నామ్ తమిజర్ కట్చి జెండా పట్టుకుని సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని నడపవద్దని సీమాన్ థియేటర్ యజమానులకు విజ్ఞప్తి చేశారు.
Also Read:టీటీడీ..అప్‌డేట్
దీంతో చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు పలు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు చేశారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి.
కేరళలో 32 వేల మంది మహిళలు అదృశ్యం కావడంతో వారి ఆచూకీ ఎక్కడనే సారాంశంతో ది కేరళ స్టోరీ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తోసేన్ రూపొందించారు. మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినట్లు చూపించడం వివాదానికి తెర తీసింది.
Also Read:రవీంద్రనాథ్ ఠాగూర్.. రచనలు ఎంతో స్పెషల్