ఇకపై కేరళ కాదు కేరళం!

4
- Advertisement -

ప్రజల కోరిక మేరకు కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది.మలయాళంలో కేరళను ‘కేరళం’ అని పిలుస్తారని, దాన్నే రాజ్యాంగంలో పేర్కొవాలని కోరింది.

వాస్తవానికి కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది కూడా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం తీరస్కరించింది. దీంతో మళ్లీ కొత్తగా తీర్మానం చేసి కేంద్రానికి పంపగా ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.

దేశంలో ఏదైనా రాష్ట్రం పేరును మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. రాజ్యాంగంలోనే పేరును మార్చాల్సి ఉంటుంది. కేరళ పేరు మార్చాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని..రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లోని అన్ని భాషల్లోనూ కేరళం అని రాయాలని కేంద్రాన్ని కోరారు విజయన్.

Also Read:#NKR21..ఐపీఎస్‌గా వైజయంతి

- Advertisement -