టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే వీరంగం.. వీడియో

257
Kerala MLA PC George
- Advertisement -

టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే కారును అపరని ఆ ఎమ్మెల్యే రచ్చ రచ్చ చేశాడు. ఈ ఘటన కేరళలోని త్రిశూర్‌ టోల్‌ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్ కారు రాగానే టోల్‌ప్లాజా సిబ్బంది ఆ కారును ఆపారు. దీంతో ఎమ్మెల్యే జార్జ్ కారులో నుంచి దిగి వచ్చి తన కారునే ఆపుతావా అంటూ అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

అంతేకాదు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కలిసి బారికేడ్‌ను విరగొట్టారు. అనంతరం టోల్ రుసుం చెల్లించకుండానే ఎమ్మెల్యే అక్కడినుండి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -