కేరళలో చదువుకున్న వారేక్కువా…అందుకే బీజేపీ పుంజుకోవడం లేదు!

138
bjp
- Advertisement -

దైవ భూమిగా, దక్షిణాది వేసవి విడిది కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ఎల్డీఎఫ్,ప్రతిపక్ష యుడీఎఫ్‌ మధ్య ప్రధానంగా పోరు జరగనుండగా బీజేపీ నామమాత్ర పాత్రకే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. కేరళలో అక్షరాస్యత రేటు 90శాతం ఇక్కడ బీజేపీ వేగంగా పుంజుకోలేకపోవడానికి ఇదో ప్రధాన కారణం అని తెలిపారు.

చదువుకుంటే మనిషిని మతం పేరుతో రెచ్చగొట్టలేమని పరోక్షంగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతోంది. నవ సమాజ స్ధాపనలో చదువే మనికి మూలం..ఇది వందశాతం నిజం..అక్షర సత్యం.

అందుకే కులం లేదు మతం లేదు..మనిషికి చదువుంటే బ్రతుకుపై,సమాజంలో జరిగే విషయాలపై అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఎవరి కాళ్లపై వారు నిలబడే ఓ ధీమా వస్తుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఓ మార్గాన్ని చూపినవారు అవుతారు. అలాంటి చదువును నిమ్నవర్గాల కులాలకు అందాలి..అందరు చదవాలి.

- Advertisement -