పాపం రాజగోపాల్.. బ్యాక్ టూ కాంగ్రెస్?

40
- Advertisement -

గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా హస్తం పార్టీ వీడి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో మునుగోడు నియోజిక వర్గం నుంచి గెలుపొందిన ఆయన.. బీజేపీలో చెరీ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికలకు తెర లేచింది. అయితే ముడుగోడులో తిరుగులేని నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గెలుపు విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా ఆయన పట్ల ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. కానీ ఎవరు ఊహించని రీతిలో మునుగోడు ప్రజలు అధికార బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు.

దీంతో ఆ ఉప ఎన్నిక ఓటమి తరువాత రాజగోపాల్ రీడ్డికి కాషాయ పార్టీలో ప్రదాన్యత తగ్గింది. ఈటెల రాజేందర్ వంటి వారికి అధిక ప్రదాన్యం ఇస్తూ వచ్చిన కాషాయ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. దాంతో ఆయన బీజేపీ విడతారనే వాదన గత కొన్నాళ్లుగా వినిపిస్తూ వస్తోంది. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవమని, తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఎన్నికల వేళ బీజేపీ విడుదల చేసిన మొదటి అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం కొంత ఆశ్చర్యకరమే.

మునుగోడు సీటు తనకే అనే కాన్ఫిడెంట్ ప్రదర్శిస్తూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. కానీ తొలి జాబితాలో ఆయనను పక్కన పెట్టడంతో కొంత అసహనంగా ఉన్నట్లు టాక్. రెండో జాబితాలో కూడా ఆయన పేరు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హవా పూర్తిగా తగ్గినట్లు బీజేపీ అంతర్గత సర్వేలు చెబుతున్నాయట. అందుకే ఆయనను వ్యూహాత్మకంగానే పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం వేట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోవాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన మునుగోడు లేదా ఎల్‌బి నగర్ సీటు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ రాజగోపాల్ రెడ్డికి తలుపులు తెరుస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read:మళ్లీ మృణాల్ తోనే ఫిక్స్ అట

- Advertisement -