కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ జాబితాలో కూడా కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరణ్‌కు టికెట్ నిరాకరించారు. గురువారం ప్రకటించిన ఈ జాబితాలో కన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేసిన సుధాకరన్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆ స్థానానికి టి.ఓ. మోహనన్‌కు టికెట్ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఈ ప్రకటనకు ముందు సీనియర్ కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపారు. మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాలని సుధాకరన్‌కు సూచించినట్లు చెప్పారు.
పెరుంబవూరులో ప్రస్తుత ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నపిల్లీకి టికెట్ ఇవ్వకుండా, మనోజ్ మూథేదన్‌ను నిలబెట్టారు. త్రిపుణితూరలో కే బాబు స్థానంలో దీపక్ జాయ్‌ను ఎంపిక చేశారు.కుట్టనాడ్ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని హెచ్చరించిన సాజీ జోసెఫ్‌ను పూన్జార్‌కు మార్చారు.ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేత అబిన్ వార్కీ అరణ్ముల నుంచి పోటీ చేస్తారు.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ బీజేపీ నేత సందీప్ వరియర్‌ను కాసరగోడ్ జిల్లాలోని త్రికారిపూర్ నుంచి నిలబెట్టారు. కొట్టాయం డీసీసీ అధ్యక్షుడు నట్టాకం సురేష్ ఎట్టుమానూరు నుంచి పోటీ చేయనున్నారు. పరస్సాల నుంచి సనల్ కుమార్‌కు టికెట్ ఇచ్చారు. కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా ఫలితాలు మే 4న ప్రకటించబడతాయి.
Also Readమెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్
:

