తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదానికి తెరలేపుతూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్లపై సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ…బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం స్కూళ్లు మంజూరు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్‌ను “ఎక్సెస్”లో కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులను KLSR కంపెనీకి ఇచ్చినట్లు తెలిపారు.
కొండా సురేఖ నియోజకవర్గంలో 4.99% ఎక్సెస్, దామోదర రాజనర్సింహా నియోజకవర్గంలో 4.99% ఎక్సెస్,ఇతర ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కూడా అధిక రేట్లకు టెండర్లు ఇచ్చినట్లు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఈ నియోజకవర్గాల్లో 4.95% ఎక్సెస్‌లో టెండర్లు కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77%, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – 4.87%, గడ్డం ప్రసాద్ కుమార్ – 4.89%, శ్రీధర్ బాబు – 4.89% ఎక్సెస్ ఉందన్నారు.
తమ ప్రభుత్వం హయాంలో అన్ని పథకాలను అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వివక్ష లేకుండా అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.
Also Read:మెగాస్టార్ చిరు..ఉచిత విద్యా ప్రాజెక్ట్

