మహానటితో దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తీ సురేష్. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన కీర్తి…ప్రస్తుతం భాష ఏదైనా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా రంగ్‌దే మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ మూవీ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి….తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది.
2015లో కిషోర్ తిరుమల తెరకెక్కించిన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘పవన్ కళ్యాణ్’, ‘మహేష్ బాబు’, ‘అల్లు అర్జున్’ ఇలా వరుసగా క్రేజ్ వున్న హీరోలతో హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసిన ఈ భామ.. తమిళ్ లో అగ్రహీరోలతో జతకడుతోంది. ‘విజయ్’ తో ‘భైరవ చేసిన ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ ‘సూర్య’, ‘కార్తీ’లతో నటించే ఛాన్స్ అందుకుంది. తాజాగా మహేష్‌తో సర్కార్ వారి పాట మూవీలో నటిస్తోంది.