అభ్యర్థుల క్రిమినల్ రికార్డుపై సుప్రీం కీలక ఆదేశాలు..

147
sc

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల క్రిమినల్ రికార్డుపై దేశ సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఓ అభ్య‌ర్థిని ఎంపిక చేసి 48 గంట‌ల్లోపు ఆ అభ్య‌ర్థికి సంబంధించిన క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలని రాజకీయ పార్టీలకు స్ప‌ష్టం చేసింది సుప్రీం.

జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టని పార్టీల గుర్తుల‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 13న తాము ఇచ్చిన తీర్పులో మార్పులు చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఇచ్చిన తీర్పు ప్ర‌కారం.. స‌ద‌రు అభ్య‌ర్థే త‌మ ఎంపిక పూర్త‌యిన 48 గంట‌ల్లోపు లేదంటే నామినేష‌న్ ప‌త్రాలు వేసే తొలి తేదీకి రెండు వారాల ముందు త‌మ‌పై ఉన్న క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాలని తెలపగా తాజాగా ఆయా పార్టీలే త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాల్సిందిగా సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది.