KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి

12
- Advertisement -

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పుణ్యమానే ఆర్టికల్ 3 ద్వారా మనం తెలంగాణను సాధించుకున్నాం అన్నారు మాజీ సీఎం కేసీఆర్. చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన కేసీఆర్…అంబేడ్కర్ కి సమున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టిన గౌరవించుకున్నాం..సమస్య ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాకు ఉందని ప్రజలకు ధీమా ఉండాలె అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలతో కిందమీద చేస్తే కాంగ్రెస్ గెలిచిందని..4 నెలల అయిన సరే వారి చిత్తశుద్ది లేదు. ఓ పాలసీ అంటూ లేదు. ఉన్న వనరులను వాడుకునే తెలివిలేదన్నారు. 10 ఏళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్ని మళ్లీ కనబడుతున్నాయి…నేను చావు నోట్లో తలపెట్టి, ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే తెలంగాణను సాధించుకున్నాం అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు చాలా సమస్యలుండే…కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్లు రైతాంగాన్ని కాపాడుకున్నాం అన్నారు.రైతులను కాపాడుకునేందుకు ఒక పాలసీ పెట్టుకున్నాం…రైతాంగానికి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 5 పథకాలు చేపట్టాం అన్నారు. రైతుబంధు, నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, పంట కొనుగోలు లాంటి పథకాలతో రైతులకు ధీమా ఇచ్చాం అన్నారు. అంబేడ్కర్ , ఫూలే ఆశయాలను గత 70 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఆచరణలో పెట్టాం…11 వందల గురుకుల పాఠశాలలను పెట్టుకున్నాం. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టుకున్నాం అన్నారు. 5 నెలలుగా ఒక్కరికి కూడా ఓవర్సీస్ స్కాలర్ షిప్ లను ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు అన్నారు.

బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది… బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. నా ముందే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే నాకు బాధనిపిస్తోందన్నారు. బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాను..బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల వెంటనే ఉంటదన్నారు.రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది. ఎందుకు పార్టీ మారిండు ?…బీజేపీ, కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తులెవరు ప్రజలకు తెలిసిన వారు కాదు అన్నారు. ఎందుకు రంజిత్ రెడ్డి పార్టీ మారిండు. ఇలాంటి వ్యక్తులకు మీరే ధీటైన బుద్ధి చెప్పాలె…అన్ని పంటలు కొంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. వానాకాలం పంట కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయన్నారు. మరి రూ. 500 బోనస్ ఇస్తారా? ఇయ్యారా ? ఇస్తా అని ఇవ్వకపోతే ఓట్ల రూపంలో గుద్ది వాళ్లను ఓడగొట్టాలె అని పిలుపునిచ్చారు.

బలహీన వర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ …బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి చూపించలే అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నాడు…కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి బీసీల శక్తి, బీసీల రాజకీయ చైతన్యాన్ని చూపించాలె అన్నారు.

Also Read:శ్రీరామనవమి..కేసీఆర్‌కు ఆహ్వానం

- Advertisement -