KCR:బీజేపీతో వచ్చేది లేదు?సచ్చేది లేదు?

26
- Advertisement -

మోడీ నూటా యాభై నినాదాలిచ్చిండు ఒక్కటి అమలుకాలేదు అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిజామాబాద్ రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్..అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చే దిన్ వచ్చినయి, సబ్కా సాత్ కాలేదు గానీ సబ్కా సత్య నాశ్ అయిందన్నారు. ప్రధాని ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నాడు వచ్చినయ.?పదిహేను లేదు పాసు లేదు, మోడీ గోదావరిని ఎత్కపోతంటే సుద్దమా యుద్దం చేద్దామా .? అన్నారు. పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలువాలే, నేను గులాబీ జెండాను ఎత్తినప్పుడు జెడ్పీ ఛైర్మాన్ ను గెలిపించి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా నిజామాబాద్ అన్నారు.

నేను జీవితకాలం ఈ జిల్లాను మర్చిపోను, బీజేపీ గెలిచి చేసిందెంది వచ్చిందేంది ఆలోచించాలే అన్నారు. నాటి పాలకులు నిజాం సాగర్ ను ఎండబెట్టినారు, శ్రీరాం సాగర్ ను వరదకాల్వ చేసుకున్నాం, సాగునీరు తెచ్చుకుని రైతన్నలను కాపాడుకున్నాం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకొన్నాం అన్నారు. మనం అమలుచేస్తున్న పాత పథకాలను వేటినీ ఇస్తాలేదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నీ బందు పెట్టినారు అన్నారు. పరిశ్రమలు తరలి పోతున్నాయి, ఐదు నెల్లల్లో ఎందుకిట్ల జరుగుతాంది.?, కేసీఆర్ రథం ఎక్కంగానే నిలదీయంగానే రైతు బంధు ఎస్తున్నాడన్నారు.

బిఆర్ఎస్ నిలదీస్తేనే అన్ని అమలైతాయి, మన బలం బీఆర్ఎస్ మనగలం బిఆర్ఎస్ మన శక్తి బిఆర్ఎస్, బిఆర్ఎస్ ను గెలిపిస్తేనే అన్నీ సాధిస్తాం అన్నారు. రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాసిపెట్టినట్టే ఉంది కాంగ్రెస్ పాలన, ఎన్నడు అడిగినా రేపే, రెండు లక్షల రుణమాఫీ కావాలంటే బాజిరెడ్డి గెలువాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏడికి పోతే ఆడ దేవుండ్లమీద వొట్లు పెట్టుకుంటాండు, బీడీ కార్మికులు నీతి నిజాయితీ చూయించి బీఆర్ఎస్ కు అండగా నిలువాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా ట్రాష్.. నమ్మొద్దు, తెలంగాణ సెక్యులర్ స్టేట్, మన ప్రభుత్వ హయాం లోముస్లింల అభివృద్ధికోసం 12 వేల కోట్లు ఖర్చు చేసినం అన్నారు.యువత ఆలోచించాలే ..రేపటి భవిష్యత్తు మీది, మనకు అన్ని హక్కులు రావాలంటే హామీలు అమలు కావాలంటేబీఆర్ఎస్ గెలవాలే, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలువాలే అన్నారు.

Also Read:కేసీఆర్ బ‌స్సు తనిఖీ..

- Advertisement -