ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని దేశంలో చెప్పిన ఏకైక వ్యక్తి తానేన్నారు కేసీఆర్. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. జీవన్ రెడ్డి పార్టీలో చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రభావం ఉంటుందని అనేక సర్వేలు వెల్లడించాయి అన్నారు. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది..గుండె దైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది ..అని జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను గుర్తు చేసుకున్నారు కేసీఆర్.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు లేవు…ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలే మిగిలాయన్నారు. అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయన్నారు. ప్రజలు ఎడుస్తున్నారన్నారని..ఇది జీవన్మరణ సమస్య అన్నారు. ఓట్లు వేసేటప్పుడు చెప్పినా…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాంరాం..దళిత బంధుకు జై భీం అయిందా లేదా చెప్పాలన్నారు.
ఒక్కసారి వేసే రైతు బంధు..నెలకొసారి వేసే పరిస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. రైతుల రుణ మాఫీ అయిందా చెప్పాలన్నారు కేసీఆర్. ఎక్కడ చూసిన చిల్లర మాటలు తప్ప..నిర్మాణత్మక కార్యక్రమం తప్ప ఏదైనా ఉందా చెప్పాలన్నారు. యూరియా కోసం రైతులు అల్లాడుతున్న పరిస్థితి ఉందన్నారు. జగిత్యాల యుద్ధం మీ వంతు..తెలంగాణ యుద్ధం మా వంతు అని పిలుపునిచ్చారు కేసీఆర్. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందన్నారు.
రైతు బంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాల్సిందేనా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం ఎందుకు దిగజారిందో చెప్పాలన్నారు.
Also Read:మెగాస్టార్ చిరు..గొప్ప మనసు!

