జీవన్ రెడ్డితో తనకు మంచి మిత్రుడని తెలిపారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు జీవన్ రెడ్డి.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. జీవన్ రెడ్డి తాను 40 ఏళ్లుగా స్నేహితులమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి..బీఆర్ఎస్‌లో చేరారన్నారు.
జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ఆరు నూరైన వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. వచ్చే బీఆర్ఎస్ సర్కార్‌లో జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
జగిత్యాల యుద్ధం మీ వంతు..తెలంగాణ యుద్ధం మా వంతు అని పిలుపునిచ్చారు కేసీఆర్. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉందన్నారు.
Also Read:మెగాస్టార్ చిరు..గొప్ప మనసు!

