KCR:తొలి సంతకం హైడ్రా రద్దుపైనే

7
- Advertisement -

జగిత్యాల వేదికగా జరిగిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ కేసీఆర్ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. “చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే అరణ్యమై భయపెడుతుంది.. గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట సైన్యమై నడుస్తుంది” అన్న అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని గుర్తు చేస్తూ, జీవన్ రెడ్డిని ‘గుండె ధైర్యం ఉన్న నేత’ గా అభివర్ణించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం: జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ అక్కడికక్కడే ప్రకటించారు. ఆయన కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని తెలిపారు.

జీవన్ రెడ్డి చేరికపై ముందే సర్వేలు నిర్వహించామని, ఆయన రాకతో పార్టీకి 100 శాతం లాభం చేకూరుతుందని సర్వేలు స్పష్టం చేశాయని కేసీఆర్ పేర్కొన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను ఆరు గ్యారంటీలు, 420 హామీలతో మోసం చేశారని విమర్శించారు.ఒకే దఫాలో రావాల్సిన రైతుబంధును వాయిదాల పద్ధతిలో ఇస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, యూరియా కోసం యాప్‌లు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆటో వాళ్లకు ఫోన్ చేస్తే ఇంటికే యూరియా వచ్చేదని గుర్తు చేశారు.

ఐదేళ్లు ఇంటింటికి నీళ్లు ఇచ్చిన పథకం, ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు. “నీళ్లు రాకపోతే నిలదీయాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. మూసీ సుందరీకరణ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, అన్యాయంపై ఎదిరించిన తీరును కేసీఆర్ వివరించారు.బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజలను పిట్టల్లా కాల్చి చంపిన ఘటన తనను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిందని అన్నారు.అవమానాలను భరించి రాష్ట్రాన్ని సాధించామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు.

Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారే: కేసీఆర్

రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.జగిత్యాల యుద్ధం: “ఇక నుంచి జగిత్యాల యుద్ధం ప్రజల వంతు అయితే, తెలంగాణ యుద్ధం కేసీఆర్ వంతు” అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని, తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల నుంచే మళ్ళీ మొదలవుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -