పొత్తూరి వెంకటేశ్వర రావు మృతి పట్ల సీఎం సంతాపం..

569
cm kcr
- Advertisement -

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు, తొలితరం జర్నలిస్టులలో ఒకరైన డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. పొత్తూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి ఎంతో సహకరించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ఉద్యమం నాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పత్రిక, సేవా రంగాల్లో పొత్తూరి సేవలు చిరస్మరణీయమని, ఓ మంచి పాత్రికేయుడిని కోల్పోయామని సీఎం అన్నారు. పొత్తూరి వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూర్చాలని సీఎం కేసీఆర్‌ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

- Advertisement -