- Advertisement -
ఈ నెల 6 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్‌ను సీఎం బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారు చేస్తారు. మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని సీఎం కేసీఆర్ గవర్నర్ కు అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -