రెండో పెళ్లికి కల్యాణలక్ష్మి సాయం

332
kalyana Lakshmi
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మీ పథకం అద్భుతమైన స్పందనవస్తున్న సంగతి తెలిసిందే. పేద ప్రజలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదని ప్రభుత్వం తన వంతు సహాయం చేస్తుంది. ఈసందర్భంగా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేస్తుంది సర్కార్. అయితే ఇప్పటి వరకూ అమ్మాయికి మొదటి పెళ్లి అయితేనే కళ్యాణలక్ష్మీ పథకం వర్తించేది..కానీ ఇప్పుడు రెండవ పెళ్లికి కూడా కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద గతంలో లబ్ధిపొందనివారికే రెండో వివాహానికి ఆర్థికసహాయం వర్తిస్తుందని పేర్కొంటూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. సిద్దిపేట జిల్లా పోతపల్లికి చెందిన పీ చిరంజీవి ప్రభుత్వానికి చేసిన వినతి మేరకు మహిళ రెండో వివాహానికి ఆర్థిక సహాయం అందించే విషయంపై విధివిధానాలను రూపొందించినట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -