కాళేశ్వరం వెట్‌ రన్‌ సక్సెస్‌..సీఎం కేసీఆర్,హరీష్ హర్షం

441
kcr harish rao
- Advertisement -

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతమైంది. ఆరో ప్యాకేజీలో మొదటి పంపు సెట్ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం చేశారు. ఇంజనీర్లు,టెక్నీషియన్లు,వర్కర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్యాకేజి 6లోని మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయిన సందర్భంగా కష్టపడ్డ ఇంజనీర్లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు.

harish kaleshwaram project

- Advertisement -