‘పదరా.. పదరా.. ఆకట్టుకుంటోన్న ‘మహర్షి’ సాంగ్‌

207
Maharshi Movie

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. మే 1వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పదరా .. పదరా .. పదరా .. నీ అడుగుకి పదునుపెట్టి పదరా’ అనే ఒక సాంగును విడుదల చేశారు.

ఈ పాటలో తలపాగా చుట్టి .. నాగలిపట్టి పొలం దున్నుతూ మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఇంతకుముందు వదిలిన 3 పాటలకు ఓ మాదిరి రెస్పాన్స్ ఉండటంతో, ఈ పాటపైనే ఈ సినిమా టీమ్ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను ఈ పాట నెరవేర్చేలానే అనిపిస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక నటిస్తుందడగా అల్లరి నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Padara Padara Lyrical | Maharshi Songs || MaheshBabu, PoojaHegde | VamshiPaidipally