- Advertisement -
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినానంతరం తొలిసారి తెలంగాణకు విచ్చేసిన వెంకయ్యనాయుడుకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ఈ ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం అందుకున్న వెంకయ్య కు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజ్‌భవన్‌లో పౌరసన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల తరపున వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టడం వెనుక వెంకయ్యనాయుడు కఠోర శ్రమ ఉందని గుర్తుచేశారు.
వెంకయ్యను సన్మానించే అవకాశం మనకే దక్కిందని అన్నారు. వెంకయ్యనాయుడు అద్భుతమైన వక్త అని, ఏ భాషలోలైనా అనర్గళంగా ప్రసంగించడంలో ఆయన దిట్ట అని తెలిపారు. అంతేకాకుండా తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం తెలుగు భాషకే గర్వకారణం అన్నారు సీఎం కేసీఆర్.
- Advertisement -