BRS:కేసీఆర్ బస్సుయాత్ర ఒకరోజు పొడగింపు

30
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం గులాబీ అధినేత కేసీఆర్ ప్రచారానికి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్రను మరో రోజు పొడగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వ‌హించ‌నున్నారు .ఈ రోడ్ షోతో గులాబీ బాస్ బస్సుయాత్ర ముగియనుంది.

షెడ్యూల్ ప్ర‌కారం 10వ తేదీన సిద్దిపేట‌లో బ‌స్సు యాత్ర ముగియాల్సి ఉండగా బ‌స్సు యాత్ర ముగింపు సంద‌ర్భంగా సిద్దిపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. అయితే మ‌రో రోజు బ‌స్సు యాత్ర‌ను పొడిగించారు.

ఇక ఇవాళ కామారెడ్డిలోని జేపీ చౌక్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు బీఆర్‌ఎస్‌ కంచుకోట మెదక్‌లోని రాందాస్‌ కూడలిలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొనున్నారు.

Also Read:Modi:ఓటేసిన ప్రధాని..

- Advertisement -