BRS:అసెంబ్లీకి కేసీఆర్

7
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకోవడంతో మంత్రివర్గంలో అలజడి మొదలైనట్టు తెలిసింది. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షం అప్రమత్తమైనట్టు తెలిసింది.

కేసీఆర్‌తో సబ్జెక్టు మాట్లాడటం కష్టమని, ఆ స్థాయిని తాము అందుకోలేమనే ఆందోళనతో అధికారపక్షం ఉన్నట్టు తెలిసింది. సాగునీటిపై షార్ట్‌ డిస్కషన్‌ను అనుమతించి సాధ్యమైనంత వరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరణతోనే నెట్టుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Also read:శాంతి చర్చలు విఫలమైతే సైనిక మార్గమే!

- Advertisement -