తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పాటు అయింది. పరిశ్రమ అభివృద్ధి, నిర్మాతలు–దర్శకులు–సాంకేతిక నిపుణుల సంక్షేమం లక్ష్యంగా ఈ కార్యవర్గం పనిచేయనుంది.
నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి ఎన్నికయ్యారు. ఆయన అనుభవం, దూరదృష్టి తెలుగు సినీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా నిలవనుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్లుగా యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీతో పాటు భారత్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. కొత్త ఆలోచనలు, ఆధునిక దృష్టితో పరిశ్రమలో మార్పులకు వీరు తోడ్పడనున్నారు.
కార్యదర్శిగా కొల్లా అశోక్ కుమార్ నియమితులయ్యారు. పరిపాలనా అనుభవం కలిగిన ఆయన ఛాంబర్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు. ట్రెజేరర్‌గా ముత్యాల రామదాసు నియమితులై ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
ఈ నూతన కార్యవర్గం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ, ఐక్యతతో ముందుకు సాగి, పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని సినీ అభిమానులు, సభ్యులు విశ్వసిస్తున్నారు.
Also Read:శాంతి చర్చలు విఫలమైతే సైనిక మార్గమే!

