సోదరి భౌతికదేహానికి నివాళుల‌ర్పించిన కేసీఆర్‌..

220
- Advertisement -

ముఖ్యమంత్రి సోదరి లీలమ్మ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లీలమ్మ(78) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పార్థీవదేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు రాగానే నేరుగా సోదరి నివాసానికి వెళ్లారు. లీలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

KCR at the funeral

అనంత‌రం అల్వాల్ స్మ‌శాన‌వాటిక‌లో నిర్వ‌హించిన‌ లీల‌మ్మ అంత్య‌క్రియ‌లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

KCR at the funeral

https://youtu.be/NF5alicUSUY

- Advertisement -