సంప్రదాయాలను కాపాడిన ఘనత బ్రాహ్మణులదే..

185
- Advertisement -

బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాచుపల్లిలో కొలన్ హనుమంత్‌రెడ్డి గార్డెన్‌లో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద గౌడ్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భారతీయ సంప్రదాయాలను కాపాడిన ఘనత బ్రాహ్మణులదేనని పేర్కొన్నారు. బ్రాహ్మణ విద్యార్థుల విదేశి చదువుల కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తుందని చెప్పారు.

కాగా, బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆ సామాజిక వర్గంలో పేదల అభివృద్ధికి సంబంధించి సీఎం కేసీఆర్ బ్రాహ్మణ ప్రతినిధులతో ఆక్టోబర్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. సమాజంలో అన్ని వర్గాల్లోని పేదల అభ్యున్నతికి కృషి జరిగినట్టే, బ్రాహ్మణ వర్గాలకూ జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్లో 10 నంచి 12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామని.. రూ.100 కోట్లతో బ్రాహ్మణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం ఈ భేటీలో హామీ ఇచ్చారు.

- Advertisement -