పెళ్లే చేసుకోవద్దనుకున్నా..కరీనా కపూర్‌

229
- Advertisement -

సాధారణంగా కథానాయికలు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారు. నటన మీద ఆసక్తితో కొంతమంది నటీమణులు కొద్దిగా గ్యాప్‌ తీసుకొని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంటారు. కానీ కరీనా కపూర్‌ మాత్రం పెళ్లి తర్వాత కూడా యథావిధిగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. త్వరలో కరీనా ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే బిడ్డ పుట్టాక సినిమాలకు దూరంగా ఉంటారా? అని అడిగితే తల్లిని అయినా తన కెరీర్‌లో ఎలాంటి తేడా రాదని చెబుతోంది బెబో. ‘పెళ్లైతే సినిమాల్లో అవకాశాలు రావని చాలామంది అన్నారు. అంతెందుకు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండమని సైఫ్‌ కూడా హెచ్చరించాడు. అప్పుడు పెళ్లి మానుకుందామని చెప్పా కానీ నా నిర్ణయాన్ని మార్చుకోలేదు.

online news portal
ఇప్పుడు తల్లిని కాబోతున్నా. ఇప్పుడూ కొందరు ఏదో ఓ ట్యాగ్‌ని అతికించి కెరీర్‌కి అడ్డుపడతారని తెలుసు. కానీ సినిమాల్లో నటించకుండా నన్ను ఏవీ ఆపలేవు. అలాగే నా వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో నాకు తెలుసు’ అని చెబుతోంది బెబో. ‘‘ప్రెగ్నెన్సీకి ముందు ఇప్పటికీ ఎలాంటి తేడా రాలేదు. ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్నా. కొంతమంది అయితే డెలీవరీ తర్వాత నా డేట్లు బుక్‌ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతా ఎప్పటిలానే జరిగిపోతుంది. గతంలో పెళ్లి చేసుకుంటే సినిమాలకు దూరం కావాల్సి వస్తుందని కొందరు అన్నారు. కానీ ఆశ్చర్యంగా పెళ్లి తర్వాతే మంచి సినిమాల్లో నటించగలిగా. ఇప్పుడు సైఫ్‌ కూడా ‘పెళ్లి తర్వాత కూడా మంచి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నావు.. అదే విధంగా తల్లి అయ్యాక కూడా అదేవిధంగా కొనసాగాలి’ అని చెబుతున్నాడు.’’ అంటోంది కరీనా.

- Advertisement -