తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ హైకమాండ్ కు పంపించారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది.
రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం అన్నారు కౌశిక్ రెడ్డి.