ఉప్పెన బ్యూటీతో రామ్ 19 షురూ చేశాడు..

25
Ram Pothineni

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా తొలి షెడ్యూల్‌కు సంబంధించిన సన్నాహాలను జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగు సోమవారం నుండి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. తొలి షెడ్యూల్ లోనే హీరో హీరోయిన్ ఇద్దరిపై సీన్స్ ప్లాన్ చేయడం విశేషం.

హీరో రామ్‌కు ఇది 19వ చిత్రం .. ఈ మధ్య రామ్ చేసిన ‘రెడ్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని అంటున్నారు. రామ్ జోడీగా కృతి శెట్టి అనగానే, కుర్రకారులో ఆసక్తి పెరిగింది. ఈ జోడీని తెరపై చూడాలనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.