టైగర్ 3 కోసం రెండు నెలల కష్టపడ్డా:కత్రినా

50
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై జోయా. ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపిస్తారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకుడు. టైగర్ ఫ్రాంచైజీ మొదలైనప్పటి నుంచి ఈ పాత్రను మనం చూస్తున్నాం. హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దారు. జోయా విషయానికి వస్తే శత్రువులను చూస్తే భయపడదు. వారిపై భయకరంగా ఎదురు దాడిని చేస్తుంది. అంతే కాదండోయ్ చాలా తెలివైనది కూడా. ఇక ఆమె యాక్షన్‌లోకి దిగితే ఆమెతో ఎవరూ సరితూగలేరు.

జోయా పాత్రను కత్రినా కైఫ్ మనసుకి ఎంతో నచ్చింది. దీంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక దర్శక నిర్మాతలు ఈ ఫ్రాంచైజీలో ఆమె పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇంతకు ముందు మరో హీరోయిన్ చేయని విధంగా అద్భుతంగా కత్రినా యాక్షన్ సీక్వెన్సుల్లో నటించింది. ఢీ అంటే ఢీ అనేలా ఉండే ఫైట్స్‌లోనూ ఆమె మెప్పించింది. ఇక టైగర్ 3 విషయానికి వస్తే కత్రినా కైఫ్ ఇందులో కష్టతరమైన యాక్షన్ సీక్వెన్సుల్లో మరింత గొప్పగా నటించింది. ఈ లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి కత్రినా 60 రోజుల పాటు శిక్షణను తీసుకుంది.

ఈ సందర్భంగా..కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘తన దేశాన్ని లేదా కుటుంబాన్ని, మానవత్వాన్ని కాపాడే సందర్భాల్లో ఓ మహిళ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందని టైగర్ 3లో చూపించాం. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రలో జోయా పాత్ర చాలా పవర్‌ఫుల్. అమ్మాయిలు లేదా మహిళలు ఈ సమాజానికి శక్తివంతమైన రక్షకులుగా వ్యవహరిస్తుంటారు. జోయా పాత్ర ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగిపోతుంది. ఆమెకు ధీటుగా అలాంటి పాత్రను మనం చూడలేం. యుద్ధం చేయాల్సిన సందర్భంలో ఆమె వెనుకడుగు వేయదు. ఆ విషయంలో మగవాళ్ల కంటే గొప్పగా ఆమె పోరాటం చేస్తుంది. జోయా స్టైల్ ఆఫ్ యాక్షన్ యూనిక్‌గా ఉంటుంది. ట్రైలర్‌లో చూపించిన విధంగా క్లిష్టమైన యాక్షన్ సీన్స్‌లోనూ జోయా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటిస్తుంది. ఆమె ఒంటరిగా వందలాది శత్రువులతో పోరాడటాన్ని మనం వెండితెరపై చూడొచ్చు. యష్ రాజ్ ఫిలిమ్స్ నా పాత్రను ప్రతీ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. ఇలాంటి స్పై చిత్రంలో యాక్షన్ సీక్వెన్సుల్లో నటించటంతో నా కల నేరవేరినట్లుగా ఉంది. ఈ ఫ్రాంచైజీలో నేను వందకు రెండు వందల శాతం న్యాయం చేయటానికి ప్రయత్నించాను. టైగర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి రెండు నెలల పాటు శిక్షణను తీసుకున్నాను. అందుకు కారణం జోయా పాత్ర మరింత వేగంగా, బలంగా కనిపించాలనేదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే ఇది కఠినమైన ట్రైనింగ్. నేను చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు మరెవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్‌తోకలిసి పని చేశాను. ఈ యాక్షన్ సన్నివేశాలను వెండి తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నారు.

Also Read:త్రివిక్రమ్ దెబ్బకు ఆమె రేంజే మారింది

- Advertisement -