Vijay Devarakonda:’కీడా కోలా’ మజా ఇస్తుంది

44
- Advertisement -

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచాయి. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నన్ను మీ అందరికీ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరో గా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నేను, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా..వేరే వేరే చోట పెరిగాం. మా నేపధ్యాలు వేరు. మా అందరినీ సినిమా కలిపింది. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం లో ఓ పాత్ర చేయించారు. అప్పుడే తరుణ్ తో పరిచయం ఏర్పడింది. తర్వాత పెళ్లి చూపులు చేశాం. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తరుణ్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాంటి సక్సెస్ తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ తరుణ్ నమ్మింది, నచ్చిన స్క్రిప్ట్, నచ్చిన వాళ్ళతో చేసే దర్శకుడు. ‘పెళ్లి చూపులు’తో నాకు లాంచ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొంత మంది కొత్త వాళ్లతో ఈ నగరానికి ఏమైంది చేసి ఇంకొంతమందికి కెరీర్ ఇచ్చా..తరుణ్ ఓ కథ తీసుకొచ్చాడు. స్క్రిప్ట్ లాక్ చేశాం. తర్వలోనే మా కాంబినేషన్ లో సినిమా వస్తుంది” అన్నారు.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడానికి ఏకైక కారణం.. ఇది తరుణ్ భాస్కర్ సినిమా. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈనగరానికి చిత్రాలు చూశాను. ఇలాంటి దర్శకులతో పని చేస్తే బాగుంటుందని ఫీలింగ్ కలిగింది. ఇలాంటి తరుణంలో తరుణ్ భాస్కర్ వచ్చి సినిమాలో నటించమని అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ టీంతో పని చేయడం హార్ట్ టచింగ్ గా అనిపించింది. నన్ను ఎంతో గౌరవంగా గొప్పగా చూసుకున్నారు. ఈ టీం అందరితో కలసి నేను ఓ చిన్నపిల్లోడిలా నటించే అవకాశం నాకు కలిగిందన్నారు.

Also Read:త్రివిక్రమ్ దెబ్బకు ఆమె రేంజే మారింది

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల విషయంలో చిన్న భయం వుండేది. థియేటర్ బయటే తిరిగేవాడిని. కీడా కోలా విషయంలో ఆ భయం లేదు. సినిమా చూశాను. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాను. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఫీలౌతున్నాను. నా స్నేహితులు ఉపేంద్ర, కౌశిక్, వివేక్, సాయి కి థాంక్స్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా మా గురించి కాదు ప్రేక్షకుల గురించి డిజైన్ చేశాం. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. నవంబర్ అంతా నవ్వుకోవచ్చు అన్నారు.

- Advertisement -