సూర్యాపేటలో గోదావరి జలాలకు దీపోత్సవం..

567
jagadeesh reddy
- Advertisement -

సూర్యాపేట నియోజవర్గంలో గోదావరి జలాలకు దీపోత్సవం నిర్వహించారు మహిళా రైతులు. చీవ్వేం ల మండలం ఐలాపురం తండా వద్ద ఎస్సారెస్పీలో ప్రవహిస్తున్న గోదారమ్మకు నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి  మహిళ రైతుల తో కలిసి పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

జగదీశ్ రెడ్డి కామెంట్స్‌…

()ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ..భగవంతుడి కృప వల్ల సూర్యాపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.
()గోదారమ్మ కు దీపోత్సవ కార్యక్రమాన్ని చూస్తుంటే.. అద్భుతమైన దృశ్యం కనిపిస్తోంది.
()గోదారి జలాల కు దీపాలను వెలిగిస్తోన్న మా అక్కాచెల్లెళ్ల కళ్లు.. కోటి దీపాల కంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాయి.
()అజ్ఞానం పోగొట్టి.. జ్ఞానం అనే జ్యోతిని వెలిగించడమే దీపారాధన ఉద్దేశం.
() రైతుల భూములు గోదావరి జలాల తో తడుస్తుంటే ..కొంత మంది కి కన్నీళ్ళు వస్తున్నాయి.
()నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యం తో గత పాలకులు కాలువలు తవ్వలేదు… కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకె కాలువలు తవ్వారు.
() వారు తవ్విన కాలువల నిర్మాణం ఉన్న లోపాలే ప్రస్తుతం నీటి ప్రవాహానికి అడ్డంకులు కలిగిస్తున్నాయి.
() ఎక్కడయినా నీటి ప్రవహాలకు ఇబ్బందులు వస్తే వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలి.
() చెరువులు నింపడమే కాదు ప్రతీ చెలక భూముల లో నీరు పరించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.
() ఇప్పటికే 600 కోట్ల రూపాయలు నిధులు కాలువల మరమ్మతులకు విడుదల అయి ఉన్నాయి.
()వచ్చే ఏడాది నుండి 2 పంటలకు నీళ్లు ఇవ్వడం తో పాటు 365 రోజులు చెరువుల లో నీళ్లు ఉండలనేది ముఖ్యమంత్రి గారి సాకారం.
()కాంతి అనేది జ్ఞానానికి చిహ్నం.. చీకటి అనేది అజ్ఞానానికి చిహ్నం.
() కాళేశ్వరం ప్రాజెక్టు ను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి గారికి సంకల్ప బలంఇచ్చి గోదారి జలాలను తమ భూముల చెంత కు చేర్చిన భగవంతుడిని మా మహిళ రైతులు జ్యోతి రూపంలో ఆరాదించడం గొప్ప పరిణామం.
() యువకులు ఎక్కడో పని కి వెళ్లే బదులు వ్యవసాయం పై దృష్టి పెట్టాలి.
() సకాలం లో రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు 24 గంటల కరెంటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతే అందుతున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, జడ్పిటిసి సంజీవ నాయక్, బాషా, ఎంపీపీ రాణి, జీవన్ రెడ్డి .నర్సింహారావు,ఇతర జిల్లా నేతలు పాల్గొన్నారు.

Guntakandla Jagadish Reddy is an Indian politician and present MLA for Suryapet. He has served as Minister of Energy in Telangana since 2019.

- Advertisement -