24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

183
minister indrakan reddy
- Advertisement -

నిర్మల్ జిల్లా వెల్మల్-బొప్పారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1160 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 400/220 కే వి విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలతో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. 2001 లో కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారు. ఉద్యమం మొదలుపెట్టిన రోజునే సంక్షేమానికి,అభివృద్ధికి రూట్ మ్యాప్ రెడీ అయింది. ఆ రూట్ మ్యాపే గడిచిన ఆరు ఏండ్లుగా అమలు జరుగుతుందని అన్నారు. అందులో మొదటిదే ఆరునెలల్లో అమలులోకి వచ్చిన నిరంతర ఉచిత విద్యుత్. యావత్ భారతదేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మోడీ ఎలుబడిలోనీ గుజరాత్ లో కానీ,సోనియమ్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఉచిత విద్యుత్ ఊసే లేదు తెలిపారు. తెలంగాణ వస్తే చిమ్మటి చీకట్లో మగ్గాల్సి వస్తుందన్నారు. అటువంటి తెలంగాణలో విద్యుత్ వినిమయంలో మొదటిస్థానంలో ఉన్నాం. తెలంగాణ వస్తే చీకట్లు అన్న వారే ఇప్పుడు చీకట్లో ముగ్గుతున్నారు. యావత్ భారతదేశం లోనే 50 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని మంత్రి కొనియాడారు.

2014 కు ముందు నిరంతర విద్యుత్ ను మొదలు కొని కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్,అమ్మఒడి,కేసీఆర్ కిట్,రైతుబందు,రైతుభిమా పథకాల పేర్లు విన్నారా.. 60 ఏండ్ల నుండి జరుగంది గడిచిన ఆరు ఏండ్లలో ఎందుకు జరుగుతుంది. ఈ మార్పును ప్రజలు గ్రహించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నందునే పథకాలు పరుగులు పెడుతున్నాయి అని ప్రశ్నించారు. మీకు పరిపాలన ఎట్లా చెయ్యాలో నేర్పింది కూడా ముఖ్యమంత్రి కేసీఆరే. తెలంగాణ ధాన్యా భాండాగారంగా తీర్చిదిద్దాం. తెలంగాణేతర రాష్ట్రాలలో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. 2014 కు ముందున్న పాలకులు వ్యవసాయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రైతాంగం నియంత్రిత సాగుపై దృష్టి సారించాలి. మన దేశంలో రెండున్నర కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు అవసరం ఉంటే 5 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్క జొన్నలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కోటి టన్నుల మొక్క జొన్నల దిగుమతికి టాక్స్ లు తగ్గించి అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిని తీసుకు వచ్చి రైతులను లాభసాటి పంటల దిశగా ప్రోతాహిస్తుంది అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్నీ చర్యలను తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో లేదో తెలిసేది కాదు. మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు లేవు. కరెంట్ సమస్యలు లేకుండా సీఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందులో ఓల్టేజీ, ఇతర సమస్యలు ఎక్కువగా ఉండేవన్నారు. అలాంటి సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని తద్వారా ప్రజలకు నాణ్యమైన,నిరంతరాయ విద్యుత్ ను సరఫరా చేస్తున్నం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వ్యవసాయ రంగం కుంటుపడేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -