వంటలక్కకు సినిమా ఛాన్స్!

487
vantalakka
- Advertisement -

మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. సీరియల్‌లో వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ బుల్లితెర టీఆర్‌పీ రేటింగ్ లో కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు టాపే. సోషల్ మీడియాలోనూ కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్స్‌ గురించే చర్చ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా వంటలక్క నటనకు ప్రేక్షకులు ఫిదా కాగా తాజాగా ఆమెకు బంపర్ ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్టు తెలిపింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటంతో వంటలక్క ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

- Advertisement -