బంగారం వెలవెల…

86
gold

బంగారం ధర వెలవెలబోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.51,410కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి రూ.47,130కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.61,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరుగుదలతో 1908 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 24.53 డాలర్లకు చేరింది.