కార్తీక దీపం..సౌందర్యకు షాకిచ్చిన రోషిణి.!

287
karthika deepam
- Advertisement -

బుల్లితెర పాపులర్ సీరియల్ కార్తీక దీపం విజయవంతంగా 1115 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కార్తీక్…మోనితను చంపడానికి కారణం తానేనని బాధపడుతుండగా జైలులో దీప గురించే ఆలోచిస్తుంటారు కార్తీక్. ఇంతలో కార్తీక్ తల్లి సౌందర్య వచ్చి తానే మోనితను చంపానని చెప్పేందుకు ప్రయత్నించగా ఇదంతా అబద్దం అని పసిగట్టి సౌందర్య ప్లాన్‌ను బయటపెడుతుంది ఏసీపీ రోషిణి. దీంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

ముందుగా కార్తీక్ అరెస్ట్‌తో దీప తెగ బాధపడిపోతుంది. తనవల్లే ఇదంతా జరిగిందని ఏడుస్తూ కుర్చుంటుంది. ఏడుస్తున దీపను శ్యావ్య ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక దీప ఏడుస్తుండటం చూసి పిల్లలు కూడా తెగ బాధపడిపోతారు.

ఇక పీఎస్‌కు వస్తుంది ఏసీపీ రోషిణి. ఆమెను చూసి జైలులో ఉన్న కార్తీక్ నవ్వగా ఆమె ఈగో హార్ట్ అవుతుంది. దీంతో వెంటనే కానిస్టేబుల్‌ని పిలిచి కార్తీక్‌ని తన చాంబర్‌కు తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తుంది. కార్తీక్ రాగానే తనను చూసి ఎందుకు నవ్వావని ప్రశ్నించగా నథింగ్ మేడమ్ అంటాడు కార్తీక్. కాసేపు డిస్కషన్‌ తర్వాత సౌందర్య వస్తుంది. మమ్మీ ఎప్పుడు వచ్చావ్ మమ్మీ.. ఎలా ఉన్నావ్? స్వప్న ఎలా ఉంది. అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్.

ఇక తర్వాత సౌందర్య గన్ టేబుల్ మీద పెట్టి సరెండర్ అవ్వడానికి వచ్చాను అని షాకిస్తుంది. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఇదే.. నా కొడుక్కి.. నేనంటే చాలా ప్రేమ.. అందుకే నేను చేసిన నేరాన్ని వాడి మీద వేసుకున్నాడు అని అనగానే రోషిణి నవ్వుతుంది. మీ కొడుక్కి మీద ఉన్న ప్రేమ కంటే మీకే మీ కొడుకు మీద ప్రేమ ఎక్కువ అనుకుంటా.. అందుకే మీరు నేరాన్ని మీద వేసుకుంటున్నారు అని చెబుతుంది రోషిణి. అసలు సౌందర్య ఎక్కడి నుండి వచ్చిందో మర్డర్ ఎప్పుడు జరిగిందో వివరించగా ఆమె షాక్ అవుతుంది. మొత్తంగా తానే మర్డర్ చేశానని కార్తీక్ ను తప్పించేందుకు సౌందర్య చేసిన ప్రయత్నం బెడిసికొడుతుంది.

- Advertisement -