కర్ణాటకలో అంబులెన్స్ అదుపు తప్పి బోల్తా… నలుగురు మృతి

58
amubulance
- Advertisement -

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు, ఒక టోల్ అటెండర్ మరణించారు. డ్రైవర్‌కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బైందూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ టోల్‌ గేట్‌ వద్ద స్కీడై ఘోర ప్రమాదాన్ని గురైంది. అక్కడ ఉన్న సీ సీ ఫుటేజీలో సెక్యూరిటీ గార్డులు మరియు టోల్ ఆపరేటర్లు అంబులెన్స్‌ను చూడగానే ఒక లేన్ నుండి మూడు ప్లాస్టిక్ బారికేడ్‌లను తొలగించడానికి ప్రయాత్నిస్తున్నారు. టోల్ ప్లాజా ముందు గార్డులలో ఒకరు విజయవంతంగా రెండు బారికేడ్లను తొలగించినట్లు ఫుటేజీలో కనపడుతుంది. కానీ అంతలోనే అంబులెన్స్‌ అదుపు తప్పి ప్రమాదాన్నికి గురైనట్లు సీసీ పుటేజీలో కనపడుతుంది.

- Advertisement -