గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 4 గం.లకు నగరంలోని ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను టీఆర్‌ఎస్ నేతలు నేడు పరిశీలించారు. సభా ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్ ఎల్బీస్టేడియంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేపటి ఎల్బీ స్టేడియంలో జరిగే సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సభకు హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్ల నుండి వేల మంది హాజరవుతారు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు, వచ్చే వారు ప్రత్యేక గేట్ల ద్వారా లోపలికి వస్తారు. ఎక్కువ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 3 గంటలకే సభ ప్రాంగణానికి రావాలని ప్రజల్ని కొరుతున్నాము. కరోన నిబంధనలకు అనుగుణంగా మాస్కులు,సానిటైజర్ లు కూడా ఏర్పాటు చేశామని కర్నె తెలిపారు.
సిటీ నలుమూలల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజల రానున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసాం. సభలో ప్రత్యేక ఎంక్లోజర్ ల ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాలి. సభకు రెండు లక్షల మంది హాజరవుతారనుకుంటున్నామని కర్నె ప్రభాకర్ తెలిపారు. ప్రజలు వీక్షించేందుకు 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసాం. కరోనా జాగ్రత్తలపై శ్రద్ద వహించాలని సీఎం ఆదేశించారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.