రెబల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన కర్నాటక స్పీకర్‌..!

415
karnataka speaker
- Advertisement -

కర్నాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కంటిన్యూ అవుతునే ఉంది. క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న అనిశ్చితి నేటితోనైనా తెరపడుతుందా లేదా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రెబల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు స్పీకర్‌ రమేశ్ కుమార్‌.

జూలై 23(రేపటిలోగా) 11 గంటల్లోగా తన ముందుకు రావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు స్పీకర్‌. మొత్తం 15 మంది ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటును వేయాల‌ని కూట‌మి నేత‌లు కోరారు. ఇందులో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇక రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో గట్టి దెబ్బ తగిలింది. ఇవాళే అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని స్వతంత్య్ర ఎమ్మెల్యే చేసిన అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం తోసిపుచ్చింది. బీఎస్పీ ఎమ్మెల్యే మ‌హేశ్‌ సీఎం కుమార‌స్వామికి అనుకూలంగా ఓటు వేస్తార‌ని ఆ పార్టీ నేత మాయావ‌తి త‌న ట్విట్ట‌ర్‌లో స్ప‌ష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంట‌ల లోపు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్పీక‌ర్ తెలిపారు.

- Advertisement -