Karnataka Results:కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

66
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 120కి పైగా స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.

అధికార బీజేపీ 79 స్థానాల్లో, జేడీఎస్‌ (JDS) 26 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:సూర్య అదుర్స్..ముంబై ఘనవిజయం

డ్యాన్సులు చేస్తూ, డప్పు వాయ్యిధ్యాలతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా  ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిమ్లాలోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ, కర్ణాటక ప్రజల శాంతి, సామరస్యం కోసం ప్రార్థించారు.

- Advertisement -