స్పీకర్ దే తుది నిర్ణయం..

239
supreme-court
- Advertisement -

కర్ణాటకలో సంక్షోభంపై సుప్రింకోర్టులో విచారణ జరగుతుంది. కాంగ్రెస్ నేతల నుంచి తమకు ముప్పు ఉందని రెబల్ ఎమ్మెల్యేలు ఇటివలే సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసంతృప్త ఎంఎల్‌ఎల తరుఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే స్పీకర్ రాజీనామాలు ఆమోదించలేదని రోహత్గి కోర్టుకు తెలిపారు. రాజీనామాలు ఆమోదించడానికి స్పీకర్‌కు అభ్యంతరం ఏంటని కోర్టులో ప్రశ్నించారు.

తమ ఇష్టపూర్వకంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బలవంతంగా అసెంబ్లీకి రావాలంటూ వారి హక్కులకు భంగం కలిగించకూడదని రోహత్గి కోర్టుకి వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేల రాజీనామా అంశంలో స్పీకర్ దే తుది నిర్ణయమని చెప్పారు సీజెఐ. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని తాము స్పీకర్ కు సూచించలేమని రోహత్గికి సుప్రీంకోర్టు తెలిపింది. తాము స్పీకర్ ని నిలుపుదల చేయలేమని,లేదా ఆయన్ను నిషేదించలేమని సుప్రీం తెలిపింది.

- Advertisement -