25 నెలల సాహో…కేక్ కట్ చేసిన ప్రభాస్‌..!

303
prabhas

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగ తెరకెక్కుతున్న చిత్రం సాహో. సుజిత్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జూన్‌ 9,2017న సెట్స్‌పైకి వెళ్లింది. జూలై 15,2019లో సినిమా పూర్తికాగా ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో కలిసి ప్రభాస్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీం మెంబ‌ర్స్ అంద‌రికి కేక్ తినిపించారు. వారితో క‌లిసి సెల్ఫీ కూడా దిగాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల సినిమాలోని ‘సైకో సయ్యా’ అనే తొలి పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.