KARNATAKA:కొలువుదీరిన కొత్త సర్కార్‌

48
- Advertisement -

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటుగా మరో 8మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు సహా పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులు, పెద్ద ఎత్తున్న కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం ఆశోక్‌ గహ్లోత్‌, బీహార్ సీఎం నితీష్‌కుమార్‌, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌ భఘేల్, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్ సుక్కు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్, జమ్ముకాశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఎన్సీపీ చీఫ్ శరద్‌ యాదవ్‌, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత పరూక్ అబ్దుల్లా, సినీ నటుడు కమల్‌ హసన్‌ తదితరులు హాజరయ్యారు.

Also Read: KARNATAKA:నేడే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం

- Advertisement -