కర్నాటకలో చేజేతులా మునిగిపోతున్న కాంగ్రెస్ !

61
- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ గెలుపుకోసం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. కాగా రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉన్నప్పటికి పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం సర్వేలు, విశ్లేషకుల అంచనా, అక్కడి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుండడం, అలాగే పాలనలో బసవరాజు బొమ్మై తీరుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉండడం వంటి కారణాలతో కన్నడ ఓటర్లు అధిక శాతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.

అంతేకాకుండా గత ముప్పై ఏళ్లలో కన్నడికులు ఏ పార్టీకి కూడా రెండవ సారి అధికారాన్ని కట్టబెట్టలేదు. ఈ రకంగా చూసుకున్న కాంగ్రెస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హస్తంపార్టీ చేజేతులా విజయానికి దూరం అవుతోందా ? ఆ పార్టీ నేతలు చేసిన చిన్న తప్పిదాలే కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేసే అవకాశం ఉందా ? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. లింగాయత్ వర్గాన్ని ఉద్దేశించి ఆ కులంలో అంతా అవినీతి పరులే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ పెద్ద ఎత్తున మండిపడుతోంది.

Also Read: నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

సింగాయత్ కులాన్ని సిద్దరామయ్య అవమానించారని ఆయనపై పరువు నష్టందావా కింద కోర్టులో కేసు కూడా వేశారు కమలనాథులు. కర్నాటకలో కాంగ్రెస్ ను ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్న బీజేపీకి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు అదునుగా దొరికింది. ఫలితంగా దీన్నే మెయిన్ హైలెట్ చేస్తోంది బీజేపీ పార్టీ. కర్నాటకలో కులాధిక్యత ఎక్కువ. అక్కడ లింగాయత్ వర్గానిదే మేజర్ రోల్. అలాంటి వర్గంపై కాంగ్రెస్ నేత సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలతో లింగాయత్ ఓటు బ్యాంకు భారీగా కాంగ్రెస్ కు దూరం అయ్యే అవకాశం ఉంది. తొందరపాటులో చేసిన వ్యాఖ్యల కారణంగా పార్టీల గెలుపోటములు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరీ ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా వివరణ ఇస్తుందో చూడాలి.

Also Read: BRS:ప్రతినిధుల సభ…తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

- Advertisement -